డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి.. దేశంలోనే కల్పన గ్యాంగ్
- రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో కీలక పురోగతి
- నిందితులు దేశం దాటలేదని నిర్ధారించిన పోలీసులు
- పలు రాష్ట్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు
- ప్రధాన నిందితురాలు కల్పన సహా ముగ్గురిపై అనుమానం
- మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులోనూ వేగవంతమైన దర్యాప్తు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్య హత్య, దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న నేపాల్‌కు చెందిన పనిమనిషి కల్పన, ఆమె ముఠా సభ్యులు దేశం విడిచి పారిపోలేదని, దేశ సరిహద్దుల్లోనే ఎక్కడో తలదాచుకున్నారని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక పోలీస్ బృందాలు దేశవ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
ఈ హత్య, దోపిడీ పక్కా ప్రణాళికతోనే జరిగిందని దర్యాప్తులో తేలింది. నిందితురాలు కల్పన ఫోన్ కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు, ఆమె ముఠా సభ్యులు నేపాల్‌కు వెళ్లలేదని స్పష్టం చేసుకున్నారు. దీంతో పూణె, ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌తో పాటు ఇండో-నేపాల్ సరిహద్దుల్లోనూ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో కల్పనతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కల్పనకు సంబంధించిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు, వారి ద్వారా కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. నిందితులకు ఎవరు ఆశ్రయం కల్పించారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు త్వరలోనే ఓ కొలిక్కి రానుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నేపాలీ ముఠా చేసిన భారీ దోపిడీ కేసులోనూ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో ఏడుగురు నేపాలీలు ఉన్నట్లు గుర్తించిన మల్కాజ్‌గిరి పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి ఢిల్లీ సరిహద్దుల్లో గాలిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు సరిహద్దు దాటి నేపాల్‌కు చేరుకున్నారా లేక దేశంలోని ఇతర నగరాల్లో తలదాచుకున్నారా అనే దిశగా విచారణ జరుపుతున్నారు.